28, జూన్ 2010, సోమవారం

ఆత్మీయులు...


(వివిద రకాల మనుష్యులు, మనస్తత్వాలు చూసినపుడు నాకనిపించిన భావం ఇలా... )


నేను నేననువారు, నీవు నీవనువారు
వెలయుచుండిరిచట వేలవేలు,

నేను నేనేయంచు నీవేమి కాదన్న
వీరులున్ గలరయ్య వెతికి జూడ,

మనము మనమనుచు మాటలాడెడివారు
మానవమతులు యిమ్మహినగలరు,

మాటలాడగబోవ మాకేదొయగునంచు
పట్టనట్టియువారు పలువురుండు.


ఇట్టిఘనులు ఇంక ఎందరున్నను గాని
నీవు నేనె, నేనె నీవు యనుచు
అంతరమ్మెరుగని ఆత్మీయులే కద
భువిని దివిగ జేయు పుణ్యమతులు.


2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

బాగుందండి. వీలు దొరికినపుడు క్రింది లింకునో సారి చూడగలరు.
http://kasstuuritilakam.blogspot.com/search/label/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF%28%20%E0%B0%9B%E0%B0%82%E0%B0%A6%E0%B0%83%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81%20%29

సో మా ర్క చెప్పారు...

అలతి అలతి తెలుగు పలుకులతో రస పర్వాలు పండించారు సౌమిత్రిగారూ!
చాలా.... చాలా,..... చాలా .....బాగుంది.
"అక్షరాకాశంలో విహరింపచేసే మానవుడు కవి" అని నిరూపించారు.