12, జూన్ 2010, శనివారం



మా మేనకోడలు వాళ్ళ స్కూల్లో పద్యాల అంత్యాక్షరి పోటీలకు వెళ్తూ,
'ట'కారంతో మొదలయ్యే పద్యం చెప్పు మామయ్య అన్నపుడు సరదాగా చెప్పిన పద్యం.


టక్కరివేషములేయుచు
చక్కగ చదువంగ సుoత సమయము లేకన్,
మిక్కిలి భారమ్ము యనుచు
గ్రక్కున పొత్తము విడుచుట గర్హ్యమ్బగురా!


4 కామెంట్‌లు:

ప్రణీత స్వాతి చెప్పారు...

చివరి వాక్యం అర్ధం చెప్పరా..ప్లీజ్.

సుమిత్ర చెప్పారు...

ప్రణీత స్వాతి గారు, ధన్యవాదములు.
పద్యాలంటే మీకున్న ఆసక్తి, తెలుసుకోవాలన్న తపన చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది.

"పొత్తము" అంటే పుస్తకము. "గర్హ్యము" అంటే తగనిపని.
-వెంటనే పుస్తకము విడిచిపెట్టుట తగనిపని, అని అర్థము.

ప్రణీత స్వాతి చెప్పారు...

సుమిత్ర గారూ ధన్యవాదాలండీ. ఇప్పుడు స్పష్టంగా అర్ధమైంది పద్యం.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది మీ పద్యం.