17, జూన్ 2010, గురువారం

శుభాకాంక్షలు


ఈ రోజు నాకు ప్రియమైన, నా చెల్లెలు పుట్టినరోజు. నా చెల్లెలికి జన్మదిన శుభాకాంక్షలతో.......

తీయని నీ జీవితమున
మాయని మమతల మధువును మది నింపగా,
హాయిని గూర్చును సతతము
ఆయుష్మాన్భవతి.. యంచు ఆశీస్సులివే.


3 కామెంట్‌లు:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సుమిత్ర గారూ!
చెల్లాయి జన్మ దిన సందర్భంగా మా ఆశీశ్శులంద జేయండి.
మీరు వ్రాసిన కందానికి కొంచెం మార్పు చేసి వ్రాసాను. చూడండి.

తీయని నీ జీవితమున
మాయని మమతల మధువును మది నింపంగా,
హాయిని గూర్చును సతతము
ఆయుష్మతివగుచు వరలు మాశీస్సులివే.

రవి చెప్పారు...

అందమైన భావాలతో చక్కని పద్యాలల్లుతున్నారు. మీ, మా చెల్లికి శుభాకాంక్షలు.

సుమిత్ర చెప్పారు...

@చింతా రామకృష్ణారావు గారు,
@ రవి గారు,

మా చెల్లికి మీ శుభాకాంక్షలు అందజేశాను, చాలా ఆనందించింది. నా అందమైన భావాలకు ఆలంబన చేకూర్చేది మీ అభినందనలే.
మీ పద్యరచన మా(మన) చెల్లికి చాలా నచ్చింది.