3, మే 2010, సోమవారం

సుమిత్రా....

ఇనుడస్తాద్రికి జనుచున్

గనె నా హ్రుద్ఫలకమందు కాంతులనేవో,

తననే మించుచు వెలిగెడు

నినుగని మురిసెన్ యచ్చట, నిజము సుమిత్రా!

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

పద్యం భలే ఉందండి.
"నినుగని యచ్చట, మురిసెను నిజము సుమిత్రా!"
అంటే ఛందస్సుకూడా ఒప్పేదండి.
స్వాగతం బ్లాగు లోకానికి,
మీరు మరిన్ని పద్యఖండికలు ప్రచురిస్తారని ఆశిస్తూ
భవదీయుడు

కంది శంకరయ్య చెప్పారు...

కందపద్యం అందంగా నడిచింది. ఐతే చివరి పాదం విషయంలో ఊకదంపుడు గారితో ఏకీభవిస్తున్నాను. అన్నట్టు ... మీ బ్లాగులో వ్యాఖ్యలు సరిగా కనిపించడం లేదు. ఫాంటు కలర్ మార్చండి.

సుమిత్ర చెప్పారు...

ఉకదంపుడు గారికి,
బ్లాగు లోకానికి స్వాగతించినందుకు ధన్యవాదములు. ఛందో దోషం వివరిస్తే సవరించగలను.

రవి చెప్పారు...

పద్యం అందంగా ఉంది. మరిన్ని ప్రయత్నించండి.

కందం రెండవ, నాలుగవ పాదాలలో జగణం లేసా నలం రావాలి. అంచేత ఊకదంపుడు గారు మీ పద్యాన్ని సవరించారు.

సుమిత్ర చెప్పారు...

శంకరయ్యగారు, ధన్యవాదములండి.

సుమిత్ర చెప్పారు...

రవి గారు, మీ అభిమానానికి ధన్యవాదములు.
వీలయితే, శంకరాభరణం బ్లాగులో సమస్యాపూరణం చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.